Representational Image (Photo Credits: File Image)

Hyderabad, Mar 10: తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తునికిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన వ్యక్తి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య (man committed suicide) చేసుకున్నాడు. స్థానిక ఎస్సై రాజశేఖర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తునికి గ్రామానికి చెందిన మస్కూరి నీరుడి నారాయణ కొడుకు యాదగిరి (28) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి అలవాటుపడిన యాదగిరి ఏం పనిచేయకుండా జులాయిగా తిరిగేవాడు. సోమవారం రాత్రి అందరితోపాటు తిని పడుకున్న తరువాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు (Medak Suicide Case) పాల్పడ్డాడు.

కుటుంబ సభ్యులు, స్థానికులు అతన్ని కిందకు దించే సరికే మృతి చెందాడు. గతంలో సైతం పలుమారు కుటుంబ సభ్యులతో గొడవపడి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. మృతునికి భార్య మంజూల, ఇద్దరు పిల్లలు గౌతమి, అఖిల్‌ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో లేబర్‌ కాలనీకి చెందిన హరికృష్ణ ఒంటిపై డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. భార్య తనపై ఫిర్యాదు చేసిందన్న ఆవేదనతో ఆయన ఆత్మహత్యాయత్యానికి పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మరచిపోకముందే అదే మరో దారుణం చోటు చేసుకుంది. వరంగల్‌ 23వ డివిజన్‌ కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలో సోమవారం అర్ధరాత్రి బండి భాస్కర్‌(40) భార్య విజయ(36) సహా ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం కలహాల కారణంగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఆయన భార్య విజయను గట్టిగా పట్టుకుని ఆమెపై కూడా పెట్రోల్‌ పోయడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

తల్లి నగ్నఫోటోలతో ముగ్గురితో కామవాంఛను తీర్చుకున్న కామాంధుడు, అదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన, నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2.60 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చిన ఆదిలాబాద్‌ కోర్టు

ఆటోలో తిరుగుతూ బట్టలు అమ్ముకునే బండి భాస్కర్, బీడీ కార్మికురాలైన విజయ దంపతుల నడుమ రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో గొడవలు జరుగుతున్నాయి. ఇంతలోనే విజయ భర్త దగ్గరి నుంచి తన బంధువుల ఇంటికి వెళ్లడాన్ని సహించలేకపోయిన భాస్కర్‌ ఈ ఘాతునికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాను మాత్రమే చనిపోవద్దని నిర్ణయించుకున్న ఆయన పథకం ప్రకారమే భార్య వద్దకు వెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ఇద్దరూ కన్నుమూశారు.

ఈక్రమంలో అడ్డుకోవడానికి వచ్చిన వారిని భాస్కర్‌ బెదిరించినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా వీరి మృతితో పధ్నాలుగేళ్ల కుమారుడు అశ్విత్‌ ఇప్పుడు అనాథలగా మారాడు. ఈ ఘటనపై విజయ తండ్రి వెంకటేష్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మిల్స్‌ కాలనీ ఇన్‌స్పెక్టర్‌ రవికిరణ్‌ తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తిచేసే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.