AP Shocker: తోటలో అపస్మారక స్థితిలో యువతి, విజయనగరం జిల్లాలో దారుణ ఘటన, విచారణ చేపట్టిన పోలీసులు, శ్రీకాకుళం జిల్లాలో టైరు పేలి ఇద్దరు వ్యక్తులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ టైరుకు అధికంగా గాలి నింపడంతో ఆ టైరు పేలిపోయి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా కొమనాపల్లి తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవిందరావు(42) ట్రాక్టర్‌ టైరు పంక్చర్‌ కావడంతో కొమనాపల్లిలోని దాసరి సూర్యనారాయణ (42) షాప్‌ వద్దకొచ్చాడు. టైర్‌కు పంక్చర్‌ వేసిన అనంతరం గాలి ఎక్కిస్తుండగా ఒక్కసారిగా (Tractor Tyre Exploding) పేలిపోయింది.

Representational Image | (Photo Credits: PTI)

Amaravati, Mar 1: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ టైరుకు అధికంగా గాలి నింపడంతో ఆ టైరు పేలిపోయి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా కొమనాపల్లి తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవిందరావు(42) ట్రాక్టర్‌ టైరు పంక్చర్‌ కావడంతో కొమనాపల్లిలోని దాసరి సూర్యనారాయణ (42) షాప్‌ వద్దకొచ్చాడు. టైర్‌కు పంక్చర్‌ వేసిన అనంతరం గాలి ఎక్కిస్తుండగా ఒక్కసారిగా (Tractor Tyre Exploding) పేలిపోయింది.

సూర్యనారాయణ టైర్‌ డిస్కంతో పాటు 20 అడుగుల ఎత్తుకు ఎగిరి విద్యుత్‌ తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ గోవిందరావును 108 సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి (Two People Died) చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక విజయ నగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్ల మండలం సమీపంలోని ఓ తోటలో యువతిని దుండగులు కట్టిపడేసిన ఘటన (young Girl tied up by thugs) స్థానికంగా కలకలం రేపింది. తెర్లాం పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న తోటలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా బాధితురాలు తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన రమగా గుర్తించారు.

కర్నూలులో విషాదం, ఉల్లి పాయలు దొంగతనానికి వచ్చాడనుకుని వ్యక్తిని రైతులు చంపేశారు, తూర్పు గోదావరి జిల్లాలో గొర్రిఖండి కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న రమ కట్లు విప్పి ఆస్పత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా బాధితురాలు రమ విజయనగరంలోని ఎస్‌కే డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం రాత్రి దుండగులు ఆమె కాళ్లు చేతులు కట్టి అక్కడ వదిలేసి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, బాధితురాలు అక్కడికి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement