Amaravati, Mar 1: కర్నూలులో విషాద ఘటన చోటు చేసుకుంది. రైతులు కల్లాల్లో ఆరబోసిన ఉల్లి గడ్డలను దొంగిలించడానికి వచ్చాడనే నెపంతో (Andhra Pradesh Shocker) ఓ వ్యక్తిని పొలాల్లో ఉల్లి గడ్డలకు కాపలా కాస్తున్న రైతులు ( man was killed when farmers severely attacked) చంపేశారు. కోసిగి సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ ధనుంజయ తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం కపటి నాగాలపురం గ్రామానికి చెందిన ఢణాపురం నసరన్న(55) శనివారం సాయంత్రం కోసిగిలో జరిగిన సిద్ధరూఢ స్వామి జాతరకు వెళ్లాడు. రాత్రి కావడంతో ఆశ్రమంలోనే నిద్రపోయాడు.
ఆదివారం తెల్లవారుజామున సజ్జలగుడ్డం గ్రామానికి వెళ్లే రోడ్డులో కాల్వలో సాన్నం చేసేందుకు అడ్డదారిలో పొలాల్లో వెళ్తుండగా.. ఆరబెట్టిన ఉల్లి పంటకు కాపలా ఉన్న రైతులు చీకటిలో అతడిని దొంగగా అనుమానించి (Stealing onion bulbs) చితక బాదారు. తీవ్రంగా గాయ పడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో 108లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వ్యక్తి మృతికి కారణమైన రైతులు కిందిగేరి ఈరన్న, కపటి ఈరన్న, కోసిగయ్య, తాయన్నతో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం స్థానిక వై.జంక్షన్ సమీపంలో గొల్లప్రోలు టోల్‌గేటు వద్ద గొర్రిఖండి కాలువ వద్దకు ఆదివారం సరదాగా ఫొటోలు తీసుకుందామని వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం మార్కెట్ వీధికి చెందిన నాంపల్లి నగేష్, కత్తులగూడెంకు చెందిన కూరాకుల భాను, తమ్మనబోయిన వెంకటసాయి, శిస్టి కరణాల వీధికి చెందిన కొండమహంతి వాసు (16), వేణుం తేజ (16) చిన్ననాటి స్నేహితులు. అందరూ ఒకే స్కూలులో ఒకటో తరగతి నుంచి చదువుకున్నారు. ప్రస్తుతం స్థానిక ప్రైయివేటు స్కూలులో పదవ తరగతి చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఐదుగురు కలిసి పిఠాపురం వై.జంక్షన్ వద్ద ఉన్న తోటలోకి వెళ్లారు. అక్కడే ఉన్న గొర్రిఖండి కాలువ వద్ద కాసేపు సరదాగా తిరిగి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేశారు.
గొర్రిఖండి కాలువ వడి ఎక్కువగా ఉండడంతో భయపడిన స్నేహితులు అందరూ ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకుని బయలుదేరగా వేణుం తేజ చేయి కడుక్కుని వస్తానని చెప్పి కాలువలోకి దిగాడు. చేయి కడుగుతుండగా కాలు జారి కాలువలోకి పడిపోవడంతో అతనిని రక్షించడానికి మిగిలిన స్నేహితులు ప్రయత్నించారు. కొండమహంతి వాసు తనకు ఈత వచ్చని చెప్పి కాలువలోకి దూకి స్నేహితుడిని రక్షించే ప్రయత్నం చేశారు. ఇద్దరూ గల్లంతయ్యారు. గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అగి్నమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. తేజ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే పెండెం దొరబాబు పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులను అండగా ఉంటామని తెలిపారు.