Telangana Shocker: ఆ అంకుల్ నచ్చాడు..అందుకే ఆయనతో వెళ్లిపోతున్నా, హయత్‌నగర్‌లో ఓ మైనర్ బాలిక నిర్వాకం, యాదయ్య అంకుల్ నచ్చాడు.. నా ఇష్టప్రకారమే వెళ్తున్నా అంటూ సోదరుడికి మెసేజ్, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో విచిత్రఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన ఓ అంకుల్ ఆమెను తనతో (Telangana Shocker) తీసుకుపోయాడు. తెలిసీ తెలియని వయసలు ఆ మైనర్ బాలిక ఆ ఆంకుల్ తో వెళ్తన్నానంటూ (minor girl Escaped with his uncle) వాట్సప్ ద్వారా సోదరుడికి మెసేజ్ పంపింది.
Hayath Nagar, Mar 1: హైదరాబాద్ నగరంలో విచిత్రఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన ఓ అంకుల్ ఆమెను తనతో (Telangana Shocker) తీసుకుపోయాడు. తెలిసీ తెలియని వయసలు ఆ మైనర్ బాలిక ఆ ఆంకుల్ తో వెళ్తన్నానంటూ (minor girl Escaped with his uncle) వాట్సప్ ద్వారా సోదరుడికి మెసేజ్ పంపింది. ఈ దారుణ ఘటన వివరాల్లోకెళితే.. కూతురు స్నేహితురాలైన 17 ఏండ్ల బాలికతో ఓ ప్రబుద్ధుడు పరారయ్యాడు. హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. దంపతులు బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లి పాత బట్టల వ్యాపారం చేస్తూ నెలలో రెండుమూడుసార్లు పిల్లలను చూసి వెళ్తుంటారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వారి చిన్నకూతురు ఈ నెల 18న దుకాణానికని వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆరా తీయగా అదే గ్రామానికి చెందిన పోలే యాదయ్య(40) కారులో వెళ్లిపోయిందని స్థానికుల ద్వారా తెలిసింది.
అదేరోజు రాత్రి ఆ విద్యార్థి ‘యాదయ్య అంకుల్ నచ్చాడు.. నా ఇష్టప్రకారమే వెళ్తున్నా’ అని ఒక పేపర్‌పై రాసి యాదయ్య ఫోన్ నుంచి ఆమె సోదరుడి వాట్సాప్ సందే శం పంపింది. ఆ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ అ యింది. దాంతో యువతి సోదరుడు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాద య్య మాయమాటలు చెప్పి బాలికను కిడ్నా ప్ చేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యాదయ్యపై గతంలో కిడ్నాప్, దొంగనోట్ల చలామణి కేసులు ఉన్నట్టు సమాచారం. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసే యాదయ్య కూతురుకు ఆ ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలు కావటం గమనార్హం.
(The above story first appeared on LatestLY on Mar 01, 2021 12:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

