Representational Image. | (Photo Credits: Pixabay)

[Poll ID="7784" title="సరిలేరు నీకెవ్వరు (or) అల వైకుంఠపురములో; ఈ రెండింటిలో మీకు ఏ సినిమా బాగా నచ్చింది?"Hyerabad, Feb 28: సిద్దిపేట పట్టణంలో శుక్రవారం పట్టణ శివారులోని ఓ కోళ్ల ఫాంలో కొందరు 68 గోవులను తీసుకొచ్చి వాటిని చంపి (Cows Slaughtered in TS) మాంసాన్ని హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యా రు. తొలుత 16 గోవులను వధించిన విషయం విదితమే. ఈ గోవధ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ రామేశ్వర్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆరు గంటల్లోపే 8 మంది నిందితులను పట్టుకున్నారు.

ఈ ఘటనపై సీపీ జోయల్‌ డేవిస్‌ మాట్లాడుతూ.. సిద్దిపేటకు (Siddipet) చెందిన జుబేర్, ఖాజా, సద్దాం, అరాఫత్, ఇబ్రహీం, హర్షద్, ఆరాఫ్, జావిద్‌లు సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్‌ ప్రాంతాల్లోని అంగళ్లలో ఆవులను కొనుగోలు చేసి, పట్టణంలోని పాత కోళ్లఫాంలో వధించి, హైదరాబాద్‌లోని ఓ వ్యక్తికి విక్రయించేవారని తెలిపారు. ఇప్పటికి ఇలా మూడుసార్లు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో వారిని అరెస్ట్‌ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌లో ట్రయల్‌ జరిపించి వీరికి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ సంఘటనతో సిద్దిపేట జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

అదుపుతప్పి..పల్టీలు కొట్టి..లారీని ఢికొట్టిన కారు, ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు, షాద్‌నగర్‌ బైపాస్‌ వద్ద విషాద ఘటన

గోవధపై బీజేపీ, బీజేవైఎం, విశ్వహిందూ పరిషత్‌ నాయకులు, కార్యకర్తలు గోవధ తగదని అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు. అయితే వారు వినకపోవడంతో పెద్ద గొడవే జరిగింది. ఈ గొడవపై సమాచారం అందుకున్న సీపీ జోయల్‌ డేవిస్‌తోపాటు ఇతర పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను చెద రగొట్టారు. దీంతో వారంతా సిద్దిపేట పాతబస్టాండ్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గోవులను వధిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ రామేశం మాట్లాడుతూ విషయం తెలియగానే సంఘటనాస్థలానికి చేరుకున్నామని, అప్పటికే 16 గోవులను వధించారని, మిగిలిన 52 గోవులను గోశాలకు తరలించామని తెలిపారు. కాగా, గోవధకు పాల్పడటం హేయమైన చర్య అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.