Weather Forecast: ఏపీకి మళ్లీ ముంచుకొస్తున్న వరదలు, ఈ నెల 16న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం

ఏపీలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఈ నెల 16న మరో అల్పపీడనం (New Low Pressure) ఏర్పడనుందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడనుంది

Low pressure (Photo Credits: PTI)

VJY, Nov 15: ఏపీలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు జనం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఈ నెల 16న మరో అల్పపీడనం (New Low Pressure) ఏర్పడనుందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో నవంబర్‌ 18 నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. వచ్చే రెండు రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

గత కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో (Bay Of Bengal) ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 13న ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. అలాగే ఈ నెల 16వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావంతో 18 నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

మార్గదర్శి సహా పలు చిట్‌ఫండ్‌ కంపెనీల్లో అధికారులు సోదాలు, సోదాల్లో పలు అక్రమాలు, ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిపిన రిజిస్ట్రేషన్ స్టాంపు అధికారులు

ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో నెల్లూరు నగరంలో లో తట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాగుంట లేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జిలోకి వరద నీరు చేరింది. దీంతో మినీ బైపాస్‌ నుంచి జీటీ రోడ్డులోకి వచ్చేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు భారీ వర్షాలతో అపార్ల్‌మెంట్‌ సెల్లార్‌లోకి నీరు చేరింది. దీంతో వాహనాలు నీట మునిగాయి. కావలిలో కూడా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజుల్లో దాదాపు ఐదు సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైంది. ఇటు ఉదయగిరి, కావలి, గూడూరు నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.చేపల వేటకు ప్రజలు సముద్రంలోకి వెల్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

175కు 175 సీట్లు సాధించేలా అడుగులు వేయండి, విశాఖ నార్త్‌ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన సీఎం జగన్

ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏటా ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు రాష్ట్రంలో అధికంగా వర్షాలు కురిసే సంగతి తెలిసిందే. ఈ రుతుపవనాల ప్రవేశించడంతో తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ఈ వర్షాల ప్రభావం తమిళనాడును ఆనుకొని ఉన్న ఏపీ ప్రాంతాల్లో కాస్త ఉంటోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement