ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో విశాఖ నార్త్‌ నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. కార్యకర్తల సమస్యలను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 'వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. పారదర్శకంగా పాలన చేస్తున్నాం. మ్యానిఫెస్టోలో చెప్పినట్టు 98శాతానికి పైగా హామీలు అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తున్నాం. 175కు 175 సీట్లు సాధించేలా అడుగులు వేస్తున్నాం. ప్రతి ఇంట్లో అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తోంది. ప్రతి కుటుంబానికి మేలు జరుగుతోంది. 175 సీట్లు సాధించడం సాధ్యమేనని' సీఎం జగన్‌ పేర్కొన్నారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)