Vijayawada Horror: విజయవాడలో దారుణం.. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు గ్యాంగ్ రేప్
ఓ మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
Vijayawada, Dec 20: ఆంధ్రప్రదేశ్ లోని (Andhrapradesh) విజయవాడలో (Vijayawada) ఘోరం చోటుచేసుకుంది. కూలీ పనులు చేసుకొని బతికే ఓ మహిళకు (Women) మాయమాటలు చెప్పి, గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితురాలు (Victim) అనారోగ్యం పాలవగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.
డబ్బుల విషయంలో ప్రేయసీప్రియుల మధ్య విభేదాలు.. ప్రియుడిని చంపి డ్రమ్ములో తీసుకెళ్లి తగలబెట్టేసింది!
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బెంజి సర్కిల్ వద్ద కూలి పనులు చేసుకుని బతికే ఓ మహిళను అదే ప్రాంతంలోని సులభ్ కాంప్లెక్స్ లో పని చేసే వ్యక్తి ఈ నెల 17న నమ్మించి కానూరు సనత్‌నగర్‌లోని ఓ గదికి తీసుకువెళ్లాడు. అక్కడ అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు మద్యం మత్తులో మూడు రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.