YSRCP Plenary: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షులుగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక, 10 తీర్మానాలకు ఆమోదం

ప్లీనరీ రెండోరోజు ఈ విషయాన్ని పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి లక్షలాది మంది పార్టీ కార్యకర్తల ఆమోదం మధ్య ప్రకటించారు.

( Photo-Twitter)

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షులుగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్లీనరీ రెండోరోజు ఈ విషయాన్ని పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి లక్షలాది మంది పార్టీ కార్యకర్తల ఆమోదం మధ్య ప్రకటించారు. ప్లీనరీ మొదటి రోజు(జులై 8, 2022న) నిర్వహించిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున 22 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతరులెవరూ నామినేషన్లు వేయలేదు. దాంతో పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షులుగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పార్టీ నాయకులంతా జగన్ ని కలిసి అభినందనలతో ముంచెత్తారు.

అదేవిధంగా పార్టీ రాజ్యాంగం సవరణల ప్రతిపాదనలకు కూడా ప్లీనరీ ఆమోదం తెలియజేసింది. మొదటిది, ఆర్టికల్ -1 ప్రకారం... యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైయ‌స్ఆర్‌సీపీగా గుర్తించవచ్చు అన్న సవరణకు ఆమోదం తెలిపారు. అలానే, ఆర్టికల్ 8, 9 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం, పార్టీ అధ్యక్షులు జీవితకాలం పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతారని చేసిన సవరణకు ఆమోదం తెలియజేశారు.

భారత్‌లో తగ్గని కరోనా తీవ్రత, ఫోర్త్ వేవ్‌ దిశగా కరోనా కేసులు, నిన్న ఒక్కరోజే 18వేలకు పైగా కేసులు నమోదు, భారీగా పెరిగిన యాక్టీవ్ కేసుల సంఖ్య

రెండు రోజులపాటు జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మొత్తం పది తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తొలిరోజు ప్లీన‌రీ సమావేశంలో మ‌హిళా సాధికార‌త‌- దిశ చ‌ట్టం, విద్యా రంగం, న‌వ‌ర‌త్నాలు- డీబీటీ, వైద్యారోగ్యంపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ- పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ప్రోత్సాహకాలు,మీడియా, పార్టీ రాజ్యాంగ సవరణ.. తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారు.



సంబంధిత వార్తలు

Gun Fire in AP: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం.. ఇద్దరికి తీవ్రగాయాలు.. అసలేం జరిగిందంటే??

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif