Mahabubabad Shocker: మహబూబాబాద్ లో షాకింగ్ ఘటన.. ఏడో తరగతి చదివే బాలుడు ఏకంగా బ్యాంక్ కే కన్నం పెట్టాలని చూశాడు.. తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళాడు.. అయితే, అనుకున్నది చేయలేకపోయాడు.. ఎందుకు?? వీడియోతో

జస్ట్ 13 ఏళ్ల వయసు.. 7వ తరగతి చదివే ఓ పిల్లాడు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టి చోరీ చేయాలనుకున్నాడు. అంతేనా.. గేటు తాళాలు పగలగొట్టి లోపలికెళ్లాడు. డబ్బుల కోసం లోపలున్న టేబుళ్లు, సొరుగులు వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి ఇంటికెళ్లిపోయాడు.

Credits: Twitter

Mahabubabad, June 30: సినిమాల ప్రభావమో లేక మరే ఇతర కారణమో తెలియదు గానీ.. జస్ట్ 13 ఏళ్ల వయసు.. 7వ తరగతి చదివే ఓ పిల్లాడు (Seventh Class Student) ఏకంగా బ్యాంకుకే (Bank) కన్నం పెట్టి చోరీ చేయాలనుకున్నాడు. అంతేనా.. గేటు తాళాలు (Locks) పగలగొట్టి లోపలికెళ్లాడు. డబ్బుల కోసం లోపలున్న టేబుళ్లు, సొరుగులు వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి ఇంటికెళ్లిపోయాడు. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా బయ్యారం మండలంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో వెలుగు చూసిందీ ఘటన.

Sai Chand Last Video in Hospital: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, గుండెపోటుకు గురైన సాయిచంద్‌ను ఆస్పత్రికి తీసుకువస్తున్న కుటుంబ సభ్యులు, కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు..

అసలేం జరిగిందంటే??

ఇర్సులాపురానికి చెందిన బాలుడు స్థానిక పాఠశాల లో ఏడో తరగతి చదువుతున్నాడు. దొంగతనాల్లో అనుభవం ఉన్న ఓ పాత నేరస్తుడితో బాలుడికి పరిచయం ఏర్పడింది. అతడే బాలుడిని చోరీకి దిగమని బెదిరించాడు. దీంతో బయ్యారం-పందిపంపుల రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో బాలుడు చోరీకి యత్నించాడు. గడ్డపారతో బ్యాంకుకు వెళ్లిన అతడు వెనుకవైపు గ్రిల్స్‌ ‌తో ఉన్న తలుపు తాళం పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. డబ్బులేమీ దొరక్కపోవడంతో వెనుదిరిగాడు. మరునాడు ఉదయం బ్యాంకుకు వచ్చిన స్వీపర్ తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి అధికారులకు సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు బాలుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

National Geographic Layoffs: మీడియా లేఆప్స్, రైటర్లందరినీ తొలగించిన నేషనల్‌ జియోగ్రాఫిక్‌, త్వరలో మ్యాగజైన్‌ మూతపడనున్నట్లుగా వార్తలు