National Geographic Magazine (Photo credits: Twitter/vaughnwallace and Twitter/CoralReefFish)

National Geographic is laying off its staff writers: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ప్రముఖ మ్యాగజైన్‌ (Magazine) నేషనల్ జియోగ్రాఫిక్‌ (National Geographic) త్వరలోనే మూతపడనుంది. ఈ సంస్థలో చివరి స్టాఫ్‌ రైటర్ల (Staff Writers)ను తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు.

గత కొన్ని రోజులుగా ఈ కంపెనీలో లేఆఫ్‌లు చేపడుతోంది. చివరగా మిగిలిన 19 మందిని (Layoffs) బుధవారం తీసేశారు. ఈ మేరకు సంస్థ ఎడిటోరియల్‌ విభాగంలోని సీనియర్‌ సభ్యులు ట్విటర్‌లో తెలిపారు.వచ్చే ఏడాది నాటికి ఇది న్యూస్‌స్టాండ్స్‌లో ఇక కన్పించదని వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది. అలాగే ఆడియో విభాగంలోనూ పలువురు ఉద్యోగులను తప్పించింది.

గూగుల్‌లో మొదలైన లేఆప్స్, మ్యాపింగ్ సర్వీస్ యాప్ Wazeలో వందల మంది ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం

1888లో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ (National Geographic) మ్యాగజైన్‌ తొలి సంచికను ప్రచురించింది. అప్పటి నుంచి శతాబ్ద కాలంగా ప్రకృతి, ప్రపంచం, సైన్స్‌ వంటి ఎన్నో అంశాలపై ఆసక్తికర కథనాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ సొంతం చేసుకుంది.

బ్యాంకింగ్ రంగంలో బిగ్ లేఆప్స్, 35 వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్న యూబీఎస్ బ్యాంక్, తొలగింపులన్నీ క్రెడిట్ సూయిస్‌లోనే..

2015 నుంచి ఈ కంపెనీ యాజమాన్యం అనేక సార్లు మారుతూ వచ్చింది. దీంతో ఎడిటోరియల్‌ పరంగానూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఈ మ్యాగజైన్‌ను ప్రముఖ డిస్నీ సంస్థ నడిపిస్తోంది. అయితే విక్రయాలు తగ్గడం, ఇతరత్రా కారణాలతో డిస్నీ ఖర్చు తగ్గింపు చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబరులో ఆరుగురు టాప్‌ ఎడిటర్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.

ఆ తర్వాత కూడా పలుమార్లు లేఆఫ్‌లు చేపడుతూ వచ్చిన సంస్థ.. తాజాగా కంపెనీలో మిగిలిన రైటర్లనూ తీసేసింది. ఈ ప్రభావం ఫొటోగ్రాఫర్లపైనా పడనుంది. ప్రస్తుతం కంపెనీలో మిగిలి ఉన్న ఎడిటర్ల సాయంతో ఫ్రీలాన్స్‌ రైటర్ల ద్వారా మ్యాగజైన్‌ను నడపనున్నట్లు తెలుస్తోంది. శాశ్వత ఉద్యోగులను మాత్రం ఇకపై తీసుకోబోరని సమాచారం.