Heart Attack: తనకేదో అవుతోందంటూ నానమ్మను నిద్రలేపిన 13 ఏళ్ల బాలిక.. మంచంపై కూర్చుని అలాగే ఒరిగిపోయి మృతి.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. బాలిక ప్రాణం తీసిన గుండెపోటు

డ్యాన్సు చేస్తుండగా కొందరు, ఆడుకుంటూ కొందరు, జిమ్‌లో వ్యాయామం చేస్తూ మరికొందరు ఇలా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న యువకులు కోకొల్లలుగా మారారు.

Heart Attack. (Photo Credits: Pixabay)

Mahabubabad, April 1: డ్యాన్సు (Dance) చేస్తుండగా కొందరు, ఆడుకుంటూ కొందరు, జిమ్‌లో (Gym) వ్యాయామం చేస్తూ మరికొందరు ఇలా గుండెపోటుతో (Heart Attack) ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న యువకులు కోకొల్లలుగా మారారు. గతంలో సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండెపోటు ఇప్పుడు పసిపిల్లల ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తోంది. గుండెపోటుకు గురై ఇటీవల పలువురు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మీరు చదివే వార్త  అంతకుమించి బాధించే ఘటన. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులోని బోడతండాలో ఇది జరిగింది.

Toll Charges Rise: టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులపై నేటి నుంచి ‘టోల్’ భారం.. అమల్లోకి కొత్త చార్జీలు.. టోల్ చార్జీలను ఐదు శాతం పెంచిన కేంద్రం.. గరుడ ప్లస్ నుంచి ఆర్డినరీ బస్సుల్లో టికెట్‌పై అదనంగా రూ. 4 పెంపు.. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 చొప్పున పెంపు

తండాకు చెందిన స్రవంతి (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గురువారం శ్రీరామ నవమి స్కూలుకు సెలవు కావడంతో స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంది. రాత్రి నిద్రపోయిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైంది. తనకేదో అవుతోందంటూ నానమ్మను నిద్రలేపింది. మంచంపై కూర్చుని ఒక్కసారిగా ఒరిగిపోయింది. తల్లిదండ్రులు వెంటనే కుమార్తెను స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే బాలిక మృతి చెందడంతో బోరున విలపించారు. గుండెపోటే స్రవంతి మరణానికి కారణంగా వైద్యులు చెప్పారు. బాలిక మృతితో తండాలో విషాదం నెలకొంది.

IPL 2023 Gujarat Titans vs Chennai Super Kings: గుజరాత్ టైటాన్స్ ఆరంభం అదుర్స్, తొలి మ్యాచులోనే చెన్నై చిత్తు..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement