AEE Nikhesh Kumar: అక్రమాస్తుల కేసులో ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ అరెస్ట్‌.. 14 రోజులు రిమాండ్‌

అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నిఖేశ్ కుమార్‌ ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

AEE Nikhesh Kumar (Credits: X)

Hyderabad, Dec 1: అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (AEE) నిఖేశ్​ కుమార్‌ ను (Nikhesh Kumar) ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​ విధించారు. దీంతో అధికారులు ఆయనను చంచల్‌ గూడ జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా నీరు పారుదల శాఖ ఏఈఈగా పని చేస్తున్న నిఖేశ్‌ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించింది. దీంతో శనివారం ఉదయం హైదరాబాద్ లో ఆయనకు సంబంధించిన 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమాస్తుల దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.

బిగ్‌ షాక్‌.. మరోసారి గ్యాస్‌ ధరల పెంపు, ఏఏ నగరాల్లో గ్యాస్ ధరలు ఎంత ఉన్నాయో తెలుసా?

రూ.170 కోట్లు ఆస్తులు

ఈ క్రమంలో నిఖేశ్‌ కు మెయినాబాద్‌ లో 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, మూడు ఫామ్‌ హౌస్‌ లు, శంషాబాద్‌, మియాపూర్‌ లో 2 కమర్షియల్‌ కాంప్లెక్స్‌ లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్​ విలువలో దాదాపు రూ.170 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

రోడ్డుపై పడ్డ ఆయిల్.. బైకులు స్కిడ్ అయి 60 మందికి గాయాలు..నాగారం రోడ్డుపై ఘటన, వీడియో ఇదిగో

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement