Samatha Murthy Statue:రామానుజ విగ్రహం సమానత్వానికి ప్రతీక, ఆయన స్పూర్తితో ముందుకెళ్తామన్న సీఎం కేసీఆర్, సతీసమేతంగా సమతామూర్తిని దర్శించుకున్న సీఎం

శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ (Sahasrabdi Utsav of Ramanuja) ఉత్సవాల్లో పాల్గొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్న కార్యక్రమంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. తొలుత భారీ శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని(Samatha Murthy statue ) పరిశీలించి పనులను సమీక్షించారు.

Hyderabad Feb 03: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ  (Sahasrabdi Utsav of Ramanuja) ఉత్సవాల్లో పాల్గొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR). రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్న కార్యక్రమంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. తొలుత భారీ శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని(Samatha Murthy statue ) పరిశీలించి పనులను సమీక్షించారు. ముఖ్యమంత్రికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి(), మై హోమ్ గ్రూప్స్ అధినేత డా.జూపల్లి రామేశ్వరరావు (Jupally rameswar rao) ఏర్పాట్ల గురించి తెలియజేశారు. శ్రీ మద్రామానుజ విగ్రహం… సమానత్వానికి ప్రతీకలాంటిదని సీఎం కేసీఆర్(CM KCR) ఈసంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. దేవుడి ముందు ప్రజలందరూ సమానమే అని… ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడని… మనం కూడా రామానుజ స్ఫూర్తితో ముందుకెళ్లాలని సీఎం ఆకాంక్షించారు. అనంతరం యాగశాలను సందర్శించి పెరుమాళ్లను దర్శించుకున్నారు.

ప్రధాని మోడీ పర్యటన (PM Modi tour) సందర్భంగా అక్కడి ఏర్పాట్లపై కూడా సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. భద్రతపరమైన సమస్యలు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక రెండోరోజు అరణి మథనంతో వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మహాక్రతువులో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీనారాయణ మహాయాగాన్ని వేదపండితులు నిర్వహించారు. ప్రధాన యాగ మండపంలో శమి, రావి కర్రలతో బాలాగ్నిని రగిలించిగా 9 నిమిషాల్లో అగ్ని ఉద్భవించింది. ఆ అగ్నిహోత్రాన్ని పెద్దది చేస్తూ 1035 కుండలాలు ఉన్న యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా 114 యాగశాలల్లో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు ప్రారంభమయింది. చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై శ్రీలక్ష్మీనారాయణ మహా యాగాన్ని నిర్వహించారు. పలు రాష్ట్రాల నుంచి హాజరైన వైష్ణవ స్వాములకు మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దీక్షావస్త్రాలను సమర్పించారు.

5 వేల మంది రుత్విజులు వేదమంత్రాలు చదువుతుండగా స్వచ్ఛమైన ఆవునెయ్యితో హోమ క్రతువును నిర్వహించారు. సృష్టి దివ్య ప్రబంధాలు, భగవద్గీతలోని ప్రధాన అధ్యయనాలు, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉజ్జీవన యజ్ఞం పూర్తిచేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరి ఎంఎల్ఏ రోజా పాల్గొని చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలు అందుకున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement