Rajareddy Engagement: మేన‌ల్లుడి నిశ్చితార్ధానికి హాజ‌రుకానున్న వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, చాలా రోజుల త‌ర్వాత ఒక్క‌టి కానున్న వైయ‌స్సార్ ఫ్యామిలీ

మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్ మెంట్ (Ys Sharmila Son Rajareddy) వేడుకలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ (YS Jagan) ఇవాళ‌ హైదరాబాద్ కు రానున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరుకానున్నారు.

CM Jagan (Photo-APCMO/X)

Hyderabad, JAN 18: మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్ మెంట్ (Ys Sharmila Son Rajareddy) వేడుకలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ (YS Jagan) ఇవాళ‌ హైదరాబాద్ కు రానున్నారు. సీఎం జగన్ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరతారు. హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ వేడుకకు జగన్ హాజరుకానున్నారు. ఈ ఎంగేజ్ మెంట్ కు వైఎస్ఆర్ కుటుంబసభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను కొడుకు నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు వైఎస్ షర్మిల (Ys Sharmila). నిశ్చితార్థంతో పాటు వివాహానికి కూడా రావాలని అందరినీ ఆహ్వానించారు షర్మిల. ఆ తర్వాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఆహ్వానాలను కూడా ఇప్పటికే షర్మిల పలువురు ప్రముఖులకు అందించారు.

Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా, ఏపీ పీసీసీ చీఫ్ నియామకం తర్వాత షర్మిల ఆసక్తికర ట్వీట్  

ఫిబ్రవరి 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది.ఇవాళ‌షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఎంగేజ్ మెంట్ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తన కొడుకు నిశ్చితార్ధ వేడుకతో పాటు పెళ్లికి కూడా రావాలని పార్టీలకు అతీతంగా షర్మిల అందరినీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement