B.Tech Student Caught While Drug Selling: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. వనస్థలిపురంలో సుష్మ థియేటర్ సమీపంలో డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడ్డ బీటెక్‌ విద్యార్థి (వీడియో)

వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ జాన్ అనే బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు.

B.Tech Student Caught While Drug Selling (Credits: X)

Hyderabad, Oct 29: హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి డ్రగ్స్‌ కేసులు (Drugs Cases) కలకలం సృష్టిస్తున్నాయి. వనస్థలిపురంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ విక్రయిస్తూ జాన్ అనే బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురంలో సుష్మ థియేటర్ సమీపంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో  పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థి జాన్‌ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ ను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ ను స్వాధీనం చేసుకున్నారు. జాన్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కంటి చూపు లేకపోవడంతో పక్కనే కొడుకు చ‌నిపోయినా గుర్తించలేని వృద్ధ తల్లిదండ్రులు.. మూడు రోజులు మృత‌దేహంతోనే సావాసం.. పస్తులతో నీరసించిన వృద్ధులకు పోలీసుల సాయం (వీడియో)

Here's Video:

అంతకు కొని.. ఇంతకు అమ్మి..

ఎండీఎఏ డ్రగ్ ను గ్రాముకు రూ. 2500కు కొనుగోలు చేసిన జాన్.. రూ.5 వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. జాన్ దగ్గరి నుంచి ఎవరెవరు డ్రగ్స్ కొనుగోలు చేశారన్న విషయంపై దర్యాప్తు కొనసాగుతుంది.

‘ఆ డైరెక్టర్ నన్ను లైంగికంగా వేధించాడు.. ఆడిష‌న్ సాకుతో దుస్తులు విప్పించి ఆ తర్వాత..’ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్ పై న‌టుడి ఫిర్యాదు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif