Ranjith Balakrishnan (Credits: X)

Newdelhi, Oct 29: ఒకవైపు మాలీవుడ్‌లో ‘మీ టూ’ ఉద్యమం తారాస్థాయికి చేరుకొని మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీని కుదిపేస్తున్న సమయంలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మూడుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రంజిత్ బాల‌కృష్ణ‌న్‌ తనను లైంగికంగా (Ranjith Balakrishnan) వేధించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో డైరెక్టర్ పై కేసు న‌మోదైంది. అయితే, ఆయ‌న‌పై ఫిర్యాదు చేసింది నటి కాదు.. న‌టుడు. అదే ఇక్కడ ట్విస్ట్. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  మమ్ముట్టి న‌టించిన ఓ మూవీ నిర్మాణ స‌మ‌యంలో రంజిత్ బాల‌కృష్ణ‌న్‌ తనను లైంగికంగా వేధించాడని (Sexually Assaulting Case) సదరు నటుడు ఆరోపించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘2012 కోజికోడ్‌ లో చిత్ర నిర్మాణ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు రంజిత్‌ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఒక రోజు ఆడిష‌న్ సాకుతో న‌న్ను బెంగ‌ళూరులోని కెంపెగౌడా విమానాశ్ర‌య స‌మీపంలోని ఓ హోట‌ల్‌ కు ర‌మ్మ‌న్నారు’ అని నటుడు పేర్కొన్నాడు.

కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం, స్కూటర్‌ని తప్పించబోయి ఒకదాని వెంట ఒటి డీకొన్న 5 కార్లు

నా దుస్తులు విప్పించి అదోలా చూస్తూ..

ఇంకా ఆయన చెప్తూ.. ‘అనంత‌రం గ‌దిలోకి పిలిచి ఆడిష‌న్‌ లో భాగ‌మంటూ నా దుస్తులు విప్పించి అదోలా చూశాడు. తర్వాత నన్ను అభ్యంతరకరంగా తాకుతూ నాపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారు’ అని న‌టుడు త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయ‌న ఫిర్యాదు మేరకు ద‌ర్శ‌కుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కాగా, ‘మీ టూ’ ఉద్యమం నేపథ్యంలో మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై జ‌స్టిస్ హేమ క‌మిటీ ఇచ్చిన నివేదిక అనంత‌రం బాధితులు ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మ‌కు ఎదురైన వేధింపుల‌ను బ‌య‌ట‌పెడుతున్న విషయం తెలిసిందే.

దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన, టీడీపీ నేత సైదు గోవర్ధన్‌ను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ, వీడియో ఇదిగో..

గతంలో కూడా..

రంజిత్ బాల‌కృష్ణ‌న్‌ పై ఇలాంటి లైంగిక ఆరోపణల కేసులు గతంలోనూ వచ్చాయి. ఇప్ప‌టికే ఓ బెంగాలీ న‌టి ఫిర్యాదు మేర‌కు కోచి పోలీసులు ఆయనపై ఓ కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. 2009లో ప‌లేరి మాణిక్యం సినిమా ఆడిష‌న్స్ స‌మ‌యంలో తాను లైంగిక వేధింపుల‌కు ఎదుర్కొన్న‌ట్లు ఆమె ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు బాల‌కృష్ణ‌న్‌ పై కేసు న‌మోదు చేశారు.