Pinarayi Vijayan Accident: కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం, స్కూటర్‌ని తప్పించబోయి ఒకదాని వెంట ఒకటి డీకొన్న 5 కార్లు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఎస్కార్ట్ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. కేరళ తిరువనంతపురంలోని వామనపురంలోని రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది.

Pinarayi Vijayan Accident: కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం, స్కూటర్‌ని తప్పించబోయి ఒకదాని వెంట ఒకటి డీకొన్న 5 కార్లు
Kerala CM Pinarayi Vijayan (Photo Credits: ANI)

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఎస్కార్ట్ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. కేరళ తిరువనంతపురంలోని వామనపురంలోని రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.

దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన, టీడీపీ నేత సైదు గోవర్ధన్‌ను శిక్షించాలని జనసేన నేతల ర్యాలీ, వీడియో ఇదిగో..

ఎస్కార్ట్‌ వాహనాల్లోని మొదటి వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ వెనుక ఉన్న ఎస్కార్ట్ వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయని సమాచారం. ఈ ఘటనలో ముఖ్యమంత్రి వాహనం కూడా స్వల్పంగా దెబ్బతింది. అయితే, సీఎంకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా ముఖ్యమంత్రి తన ప్రయాణం కొనసాగిచారు.

Pinarayi Vijayan Accident: 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 28, 2024 10:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).