Beer Sales in Hyderabad: మందుబాబులా మజాకా, 17 రోజుల్లో కోటి రూపాయల బీర్లు తాగేసిన హైదరాబాదీలు, ఏప్రిల్ నెలలో అమాంతం పెరిగిన బీర్ల అమ్మకాలు

హైదరాబాద్ నగరంలో బీర్లు మంచి నీళ్ల మాదిరిగా అమ్ముడుపోతున్నాయి. అసాధారణంగా పెరుగుతున్న ఎండలతో మందుబాబులు బీర్లను అమాంతం తాగేస్తున్నారు. ఫలితంగా ఏప్రిల్ నెలలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

Photo: Wikimedia Commons.

One Crore Beers Sold in Hyderabad: హైదరాబాద్ నగరంలో బీర్లు మంచి నీళ్ల మాదిరిగా అమ్ముడుపోతున్నాయి. అసాధారణంగా పెరుగుతున్న ఎండలతో మందుబాబులు బీర్లను అమాంతం తాగేస్తున్నారు. ఫలితంగా ఏప్రిల్ నెలలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల 1 నుంచి 17 వరకు నగరంలో ఏకంగా 1.01 కోట్ల బీర్లు అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది.ఆ శాఖ చెబుతున్న దాని ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో కలిపి ఈ నెల 17 వరకు మొత్తం 8,46,175 కేసుల బీర్లు అమ్మడుపోయాయి. ఒక్కో కేసులో 12 బీర్లు ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 1,01,54,100 బీర్లు అమ్ముడుపోయాయి.

ఐఎండీ తీపి కబురు, రానున్న మూడు రోజుల్లో అక్కడ వర్షాలు, దక్షిణ భారతంలో మాత్రం మండే ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న భానుడి భగభగలు

అలాగే, ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. నెలకు సగటున లక్ష బీరు కేసులు అదనంగా అమ్ముడవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement