Heatwave (Photo Credits: PTI)

New Delhi, April 19: దేశంలో అన్ని రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. చాలా ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో అయితే చెప్పడానికి లేదు. వరుసగా మూడో రోజు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే దాదాపు 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

అయితే, భారత వాతావరణశాఖ (ఐఎండీ) మాత్రం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో వెస్టర్న్ డిస్ట్రబెన్స్ యాక్టివ్ కావడంతో వాయవ్య భారతదేశంలో ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లపై దట్టమైన మేఘాల కదలికలు కనిపిస్తుండడంతో వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

జాగ్రత్తగా ఉండాల్సిందే, తెలుగు రాష్ట్రాలకు హీట్‌వేవ్ అలర్ట్, మరో వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించిన ఎఐండి

మిగతా ప్రాంతాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు సమీపంలో ఉన్నట్టు వివరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, హమీర్పూర్‌లలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో 43.2 డిగ్రీలు, కోటాలో 42.8 డిగ్రీలు, బన్సవారాలో 42.7, అల్వార్‌లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీహార్‌ రాజధాని పాట్నాలో 44.1 డిగ్రీలు, షేక్‌పూర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాదు, వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఫలితంగా అనేక మంది వడదెబ్బతో బారిన పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలలో ఎక్కువసేపు గడపడం వల్ల తగులుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేయకుండా జాగ్రత్త పడాలని. లేదంటే డీహైడ్రేషన్‌ తలెత్తి, కీలక అవయవాలు పనిచేయడం మానేస్తాయంటున్నారు. చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయే ముప్పు పెరుగుతుందన్నారు. వీలైనంత వరకూ బయట తిరగకకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కుండలో ఉంచిన మంచినీటిని ఎక్కువ తీసుకోవాలంటున్నారు.

కరోనా కేసుల్లో మళ్లీ పెరుగుదల, గత 24 గంటల్లో 10,542 మందికి కోవిడ్, 63 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య, కొత్తగా 27 మంది మృతి

ఎండ వేడిమి పెరగడంతో శీతలపానియాలు, జ్యూస్‌ కేంద్రాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. అదే సమయంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలోనూ ప్రత్యేకంగా కూలింగ్‌ వాటర్‌ క్యాన్లను అమ్ముతున్నారు.వీటిని మంచి గిరాకీ పెరిగింది. ఫ్రీజ్‌ల, ఎసిల వ్యాపారాలు జోరందుకున్నాయి. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు.