COVID-19 representational image (Photo Credit- IANS)

New Delhi, April 19: దేశంలో గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 10,542 మంది వైరస్ బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63 వేలు దాటిందని వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు చేరింది. ఇందులో 4,42,50,649 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.

మరో 63,562 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,31,190 మంది మరణించారు. గత 24 గంటల్లో 8175 మంది కోలుకోగా, కొత్తగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేట్ 26.54 శాతానికి చేరిందని పేర్కొంది. ఢిల్లీలో సగటున రోజూ వెయ్యికి పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయని వివరించింది.

తెలంగాణలో కరోనా బూస్టర్ డోసుగా కార్బెవాక్స్, పెరుగుతున్న కరోనా కేసులతో కీలక నిర్ణయం, గతంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ తీసుకున్నవారికి కూడా బూస్టర్ డోసుగా కార్బెవాక్స్

ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health Ministry) వెల్లడించింది. రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,27,758) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.