Kavitha Arrest-Case Against KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత మరో కీలక పరిణామం.. కేటీఆర్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు.. కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ మరో ట్విస్ట్ చోటుచేసుకున్నది.
Hyderabad, Mar 16: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC), మాజీ సీఎం కేసీఆర్ (Ex CM KCR) కుమార్తె కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్ట్ మరో ట్విస్ట్ చోటుచేసుకున్నది. కవిత సోదరుడు, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ తమ విధులకు ఆటంకం కలిగించారని ఈడీ అధికారి భాను ప్రియా మీనా ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
కవిత అరెస్ట్ సమయంలో ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా ఆమెను అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసే శుక్రవారం అరెస్టు చేసేందుకు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.