KTR on Kavita Arrest (PIC@ X)

Hyderabad, March 15: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha arrest) ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన ఈడీ అధికారుల తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) మండిపడ్డారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ ఎలా చేస్తారని ఆయన ఈడీ అధికారులను నిలదీశారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్ట్‌ చేయబోమని సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన మీరు ఇప్పుడు ఎలా ఆ మాట తప్పుతారని ప్రశ్నించారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన మాటను మీరు అరెస్ట్‌ చేస్తే న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుంటారని కేటీఆర్‌ హెచ్చరించారు. సెర్చ్‌ వారెంట్‌ ఇచ్చి సోదాలు పూర్తిచేశామని, అరెస్ట్‌ వారెంట్‌ ఇచ్చి అరెస్ట్‌ చేస్తున్నామని ఈడీ అధికారిణి భానుప్రియ మీనా మేడమ్‌ చెబుతున్నారని, ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్ట్‌ ఎలా చేస్తారని ఆయన మండిపడ్డారు.

 

ఈడీ అధికారులు కావాలనే శుక్రవారం వచ్చి అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. సోదాలు పూర్తయిన తర్వాత కూడా కుటుంబసభ్యులు ఇంట్లోకి రావద్దని అధికారులు హుకుం జారీ చేస్తున్నారని ఆయన చెప్పారు. మా లాయర్‌ను కూడా లోనికి అనుమతించడం లేదని విమర్శించారు. ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా పక్కనే ఉన్నారు.