ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8 మంది అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. తనిఖీల అనంతరం ఆమెను మనీలాండరింగ్‌ కేసులో కవితను శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు అరెస్టు చేశామని ప్రకటించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌ పేరుతో ఈ ప్రకటన విడుదల చేశారు.

శుక్రవారం అరెస్ట్ అనంతరం ఆమె మాట్లాడుతూ... మద్యం కేసులో ఈడీ విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్నారు. పార్టీ శ్రేణులు ఇలాంటి వాటిని మనోధైర్యంతో ఎదుర్కోవాలన్నారు. కవిత అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడా అడ్డుకోరని... ఎవరూ ఆపరని... మీరు స్వేచ్ఛగా తీసుకువెళ్లవచ్చునని బీఆర్ఎస్ నాయకులు ఈడీ అధికారులకు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)