Corona in Telangana: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పరిశీలించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన, తెలంగాణలో కొత్తగా మరో 415 మందికి పాజిటివ్, 5,974గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
దేశంలో కొత్త రకం న్యూ స్ట్రెయిన్ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో నేడు, రేపు జరిగే కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.....
Hyderabad, December 31: దేశంలో కొత్త రకం న్యూ స్ట్రెయిన్ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో నేడు, రేపు జరిగే కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు పరిశీలించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
ఇక ప్రతిరోజు నమోదయ్యే కేసుల విషయానికి వస్తే, తెలంగాణలో గత 24 గంటల్లో 43,413 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 415 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 537 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 68,82,694 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,86,354కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 91 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 43, మేడ్చల్ నుంచి 39, కరీంనగర్ నుంచి 33 మరియు వరంగల్ అర్బన్ నుంచి 31 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,541కు పెరిగింది.అలాగే, బుధవారం సాయంత్రం వరకు మరో 316 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 278,839 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,974 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)