CM KCR Interesting Comments: ఆ ప‌నికంటే నాకు సీఎం ప‌ద‌వి గొప్ప కాదు, తెలంగాణ ప్ర‌జ‌ల కోస‌మే నా తండ్లాట‌, జ‌గిత్యాల స‌భ‌లో సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు. ఖచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి.. అది నా పంథం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దాని కోసం తండ్లాడున్నాం

CM KCR Interesting Comments (PIC@ BRS X)

Hyderabad, NOV 26: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీసుకువచ్చిన పేరే ఆకాశమంత పెద్దదని.. దాన్ని మించిన పదవి ఉన్నదా? నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు. ఈ కీర్తి నాకు చాలు’ అంటూ వ్యాఖ్యానించారు. జగిత్యాల బీఆర్‌ఎస్‌ (KCR Meeting) ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చాలా క్లియర్‌గా జగిత్యాలలో చెబుతున్నా. చాలా మందికి తెలుస్త లేదు. నాకేం కావాలి..? తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది. దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చారు కాబట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా. నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు. ఈ కీర్తి చాలు నాకు’ అన్నారు.

 

నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు. ఖచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి.. అది నా పంథం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దాని కోసం తండ్లాడున్నాం తప్పితే ఈ పదవి కోసం కాదు. నాకు 70 ఏళ్ల వయసు వచ్చింది. ఇంకా ఈ జీవితంలో. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది. పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమై ఓటు వేయొద్దని మనవి చేస్తున్నా. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో చర్చ పెట్టండి.. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టండి.. తప్పకుండా బీఆర్‌ఎస్‌ పార్టీకి ఘనవిజయాన్ని చేకూర్చండి. సంజయ్‌ అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తాం. వందశాతం చేయించే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నా. సంజయ్‌ని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నా’నన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Advertisement
Advertisement
Share Now
Advertisement