Revanth Reddy Reaction on Padma Awards: పద్మ అవార్డులపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి, కేంద్రం వివక్ష చూపి, తెలంగాణకు అన్యాయం చేసిందన్న రేవంత్‌, ఈ విషయంలో ప్రధానికి లేఖ రాసే యోచన

పద్మ పురస్కారాల (Padma Awards 2025) విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాయాలని యోచనలో సీఎం ఉన్నారు.

CM Revanth Reddy (X)

Hyderabad, JAN 25: పద్మ పురస్కారాల (Padma Awards 2025) విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాయాలని యోచనలో సీఎం ఉన్నారు. గద్దర్‌ (Gaddar), చుక్కా రామయ్య (Chukka Ramaiah), అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు.

Padma Awards: దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌, నందమూరి బాలకృష్ణ, అజిత్‌కుమార్‌కు పద్మభూషణ్, మరికొందరికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం 

139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం తెలంగాణ కనీసం ఐదు పురస్కారాలు కూడా ప్రకటించకపోవడంపై రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement