Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో 7 గంటలు పైగా కవితను విచారిస్తున్న ఈడీ, ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నతెలంగాణ అదనపు ఏజీ

ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు రెండోసారి హాజరైన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు

Kalvakuntla Kavitha | File Image

New Delhi, Mar 20: ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు రెండోసారి హాజరైన ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం విచారణ ప్రారంభించిన ఈడీ అధికారులు దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు. లిక్కర్‌ స్కాంలో నిందితుడు, హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిపి విచారించింది.

పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఎమ్మెల్సీ కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సౌత్‌ గ్రూప్‌తో సంబంధాలపై ముఖాముఖిగా వీళ్లను ప్రశ్నించినట్లు సమాచారం. సుమారు నాలుగు గంటలపాలు వీళ్లను ప్రశ్నించి.. అనంతరం పిళ్లైను కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టుకు తరలించారు.ఒకవైపు కవిత విచారణ కొనసాగుతుండగానే.. తెలంగాణ అదనపు ఏజీ దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

నన్ను ప్రేమించు లేదా ఏదైనా తాగి చావు, నిశ్చితార్థం జరిగిన యువతికి వేధింపులు, తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి

గత వారం కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినా ఆమె విచారణకు హాజరుకాలేదు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనుందని, న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వేచిచూడాలని కవిత ఈ నెల 16న లేఖ ద్వారా ఈడీకి విజ్ఞప్తి చేశారు. కానీ ఇవాళ రావాలని ఈడీ మళ్లీ నోటీసులు ఇవ్వడంతో కవిత విచారణకు హాజరయ్యారు.

ఢిల్లీ స్పెషల్‌ కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అనంతరం పిళ్లైని తీహార్‌ జైలుకు తరలించారు. సుమారు నాలుగు గంటలపాటు ప్రశ్నించి.. అనంతరం పిళ్లైను కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టుకు తరలించారు. మరోవైపు కవితకు ఈడీ అధికారులు విడిగా విచారిస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement