Cat Theft in Hyderabad: ఆరుబయట ఆడుకుంటున్న పిల్లిని చోరీ చేసిన వ్యక్తి, రూ. 50వేలు పెట్టి కొన్నానంటూ పిల్లి యజమాని ఆవేదన, ఇంతకీ ఆ పిల్లి ప్రత్యేకత ఏంటంటే?

ఈ పిల్లి కండ్లు ఒక‌టి గ్రీన్ క‌ల‌ర్‌లో, మ‌రొక‌టి బ్లూ క‌ల‌ర్‌లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్ర‌త్యేక‌త‌. అయితే ఆదివారం రాత్రి ఆ పిల్లిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అప‌హ‌రించారు. దీంతో బాధితుడు సోమ‌వారం వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Rare breed cat theft in Hyderabad (PIC @ Google)

Hyderabad, JAN 11: పెంపుడు జంతువులైన కుక్క‌ల‌ను దొంగిలించ‌డం చూశాం.. కానీ పిల్లుల‌ను (Cat theft) కూడా దొంగ‌త‌నం చేస్తున్నారు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని (rare breed) గుర్తుతెలియని వ్యక్తులు అప‌హ‌రించారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్‌ కోల సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పరిధిలోని జ‌హంగీర్‌ కాలనీలో షేక్‌అజహార్‌ మహమూద్ (Sheikh Hussain Mahabub) అనే వ్య‌క్తి నివాసం ఉంటున్నాడు. అరుదైన జాతికి చెందిన ఓ పిల్లిని రూ. 50 వేల‌కు కొనుగోలు చేసి, దాన్ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్నాడు. 18 నెల‌ల వ‌య‌సు ఉన్న ఆ పిల్లికి నోమ‌నీ (Nomani) అని నామ‌క‌ర‌ణం చేశారు.

అయితే ఈ పిల్లి కండ్లు ఒక‌టి గ్రీన్ క‌ల‌ర్‌లో, మ‌రొక‌టి బ్లూ క‌ల‌ర్‌లో ఉంది. ఇదే ఈ పిల్లి ప్ర‌త్యేక‌త‌. అయితే ఆదివారం రాత్రి ఆ పిల్లిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు అప‌హ‌రించారు. దీంతో బాధితుడు సోమ‌వారం వ‌న‌స్థ‌లిపురం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement