Telangana: వైరల్ వీడియో.. పక్కింటోడి భార్యతో ఎస్సై రాసలీలలు, రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదిన భర్త, సదరు ఎస్సైని సస్సెండ్ చేసిన పోలీసు ఉన్నతాదికారులు, వనపర్తిలో ఘటన

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో కొత్తకోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ ఎస్సైని ఆమె భర్త రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని తన స్నేహితులతో కలిసి చితకబాదాడు. మహిళ భర్త, అతని స్నేహితులు కలిసి ఎస్సైను చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Representational Image | Couple (Photo Credits: Pixabay)

Wanaparthy, Nov 26: తెలంగాణలోని వనపర్తి జిల్లాలో కొత్తకోటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ ఎస్సైని ఆమె భర్త రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని తన స్నేహితులతో కలిసి చితకబాదాడు. మహిళ భర్త, అతని స్నేహితులు కలిసి ఎస్సైను చితకబాదిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకోటకు చెందిన ఓ మహిళతో వనపర్తి రూరల్ ఎస్సై షేక్ షఫీ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలియడంతో ఇద్దరిని రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకునేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్నాడు. కాగా ఈ నెల 18న మహిళను కలిసేందుకు ఎస్సై షేక్‌ షఫీ ఆమె ఇంటికి వచ్చాడు. భార్యతో రాసలీలల్లో మునిగి ఉండగా మహిళ భర్త తన స్నేహితులతో ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో భార్యతో ఉన్న ఎస్సైని మహిళ భర్త, అతని మిత్రులు కలిసి చితకబాదారు. ఎస్సై ఎంత ప్రాధేయపడినా ఆగకుండా పిచ్చి కొట్టుడు కొట్టారు.

కాల్ ఎత్తగానే నగ్నంగా.. మనల్ని కూడా నగ్నంగా చూడాలంటూ ఊరిస్తారు, ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది, సెక్స్‌టార్షన్‌ పై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులు, సైబర్ నిపుణులు

అడ్డువచ్చిన భార్యను కూడా వాయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఎస్సైని వనపర్తి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.

అలాగే సదరు ఎస్సైని పోలీసు ఉన్నతాదికారులు సస్సెండ్ చేశారు. అయితే గౌరవప్రదమైన పోలీస్‌ వృత్తిలో ఉండి ఇలా నీచ బుద్ది చూపించిన ఎస్సై షేక్‌ షఫీపై పులువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement