Good News For Telangana Professors: యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ఐదేండ్లు పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచింది.

Telangana government (X)

Hyderabad, Jan 31: తెలంగాణలోని (Telangana) విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు (Professors) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ఐదేండ్లు పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

ఇలా మార్పు

ఉన్నత విద్యాశాఖ పరిధిలో పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో 2,817 ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 757 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 2,060 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి నెలా ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాలలో ఇద్దరు ముగ్గురు చొప్పున ప్రొఫెసర్లు పదవీ విరమణ పొందుతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఐదేండ్ల పాటు ఈ విరమణలు ప్రస్తుతం ఆగిపోనున్నాయి.

ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స  

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement