IPL Auction 2025 Live

IMD Alert: తెలంగాణకు మరోసారి ఎల్లో అలర్ట్ జారీ, రానున్న మూడు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏయే జిల్లాలకు అలర్ట్ జారీ చేశారంటే?

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Rains (Photo-Twitter)

Hyderabad, SEP 14: తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన (Heavy Rain alert) చేసింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ (Yellow alert) చేసింది. మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Skill Development Scam Case: ప్రజలు ఎవరూ అయ్యో పాపం అన్న పాపాన పోలేదు, చంద్రబాబు అరెస్ట్‌పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ 

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని సూచించింది.



సంబంధిత వార్తలు