Hyderabad Shocker: నగ్నంగా ఛాట్ చేయ్..లేకుంటే నీ ముఖాన్ని న్యూడ్‌ చిత్రాలకు తగిలించి ఇతరులకు పంపిస్తా, మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్న యువకుణ్ని అరెస్ట్ చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

మహిళల చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి అశ్లీల చిత్రాలుగా (morphing photos) మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వెల్లడించారు.

Arrested| Representational Image (Photo Credit: ANI)

Hyderabad, June 22: హైదరాబాద్ నగరంలో సోషల్ మీడియా ద్వారా మహిళలపై బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు (Hyderabad Cyber Crime Police) అరెస్ట్ చేశారు. మహిళల చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి అశ్లీల చిత్రాలుగా (morphing photos) మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వెల్లడించారు.

ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి, గుండూరుకు చెందిన మొగిలి ఆంజనేయులు(21) హైదరాబాద్‌ కొత్తపేటలో నివాసముంటున్నాడు. డిగ్రీ మధ్యలో మానేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని తండ్రి కాపలాదారుడుగా చేస్తున్నాడు.కాగా ఆంజనేయులు love_call_me_anji పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచాడు. మహిళల ఖాతాలను ఫాలో చేసి వారితో ఛాటింగ్‌లు చేస్తుంటాడు. ఎవరైనా అతన్ని బ్లాక్‌ చేస్తే.. రకరకాల పేర్లతో నకిలీ ఖాతాలు తెరుస్తాడు.

వాళ్ల పొట్టి దుస్తులు వల్లే మగాళ్లలో కోరికలు పెరిగిపోతున్నాయి, అందుకే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి, సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

బ్లాక్‌ చేసిన ఖాతాలోని డీపీ చిత్రాలను తీసుకొని న్యూడ్‌ చిత్రాలకు బాధితుల ముఖాలను తగిలించి నకిలీ ఖాతాల ద్వారా బాధితులకే పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నగ్నంగా తనకు దర్శనమివ్వాలని, లేదంటే మీ న్యూడ్‌ చిత్రాలను ఇతరులకు పంపించి వైరల్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. కొందరు బెదిరింపులకు లొంగిపోయి అంగీకరించారు. ఎవరైతే అతను చెప్పింది చేశారో.. వారిని తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానని హెచ్చరించాడు. ఇలా 15 మంది చిత్రాలను మార్ఫింగ్‌ చేశాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే సరదా కోసమే ఇలా చేశానని నిందితుడు చెప్పడం గమనార్హం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement