Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరమైన హత్యలు.. బేగంబజార్ లో భార్య, కుమారుడి మర్డర్.. ఆపై ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న భర్త.. చాకచక్యంగా తప్పించుకున్న పెద్ద కొడుకు (వీడియో)
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో యూపీకి చెందిన సిరాజ్ అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Hyderabad, Dec 13: హైదరాబాద్ (Hyderabad) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో యూపీకి (UP) చెందిన సిరాజ్ అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడి మరో కుమారుడు ఎంతో చాకచక్యంగా తండ్రి నుంచి తప్పించుకుని పారిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన సిరాజ్ అనే వ్యక్తి గత ఆరేళ్లుగా నగరంలోని పాతబస్తీ గాజుల తయారీలో పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాడు.
Video:
రెండు రోజుల్లోనే మారిన పరిస్థితి
హైదరాబాద్ లో కాపురం పెట్టిన రెండు రోజుల్లోనే భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున భార్యను గొంతు కోసి చంపేసిన సిరాజ్ చిన్న కుమారుడు హైదర్ ను గొంతు నులిమి చంపుతుండగా లేచిన పెద్ద కుమారుడు భయంతో కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశాడు. అతని అరుపులతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్యా కుమారుడిని చంపిన తర్వాత సిరాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలం చేరుకునే సరికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.