Hyderabad City Police: హైదరాబాద్ పోలీస్ అధికారుల నంబర్లు మారాయి, అమల్లోకి వచ్చిన కొత్త నంబర్లు ఇవే
ఇప్పటి వరకు వినియోగిస్తున్న బీఎస్ఎన్ఎల్ నంబర్ల స్థానంలో ఎయిర్‌టెల్‌కు చెందినవి సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
Hyd, August 18: హైదరాబాద్ నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారుల (Hyderabad City Police) ఫోన్ నెంబర్లు మారాయి. ఇప్పటి వరకు వినియోగిస్తున్న బీఎస్ఎన్ఎల్ నంబర్ల స్థానంలో ఎయిర్‌టెల్‌కు చెందినవి సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. పాత సర్వీస్ ప్రొవైడర్ సేవల వల్ల నెట్‌వర్క్ పరమైన ఇబ్బందులు వస్తుండటంతో పోలీసులు అధికారులు మరో సంస్థ సేవలు తీసుకోవాలని నిర్ణయించారు. 4జీ, 5జీతో పాటు అనేక వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (వీఏఎస్) అందించడానికి ఎయిర్‌టెల్ సంస్థ ముందుకు వచ్చింది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ పోలీసు విభాగం ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
తొలుత మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా ప్రస్తుతం ఉన్న నెంబర్లనే (Hyderabad City Police Dials) కొనసాగించాలని భావించారు.అయితే దీనికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తుండటంతో నెంబర్లు మార్చాలని నిర్ణయించారు. దీంతో సోమవారం నుంచి 9490616––– సిరీస్‌కు బదులుగా 8712660–––, 8712661––– సిరీస్‌ల్లో ఆరోహణ క్రమంలో నెంబర్ల వినియోగం మొదలైంది. క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల కొత్త నెంబర్లు ప్రజలకు అలవాటు అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికోసం నెల రోజుల పాటు పాత నెంబర్లూ అందుబాటులో ఉంచుతున్నారు.
అమల్లోకి వచ్చిన కొత్త నెంబర్లు ఇవే
► పోలీసు కమిషనర్– 8712660001
► అదనపు సీపీ (శాంతిభద్రతలు)– 8712660002
► అదనపు సీపీ (నేరాలు)– 8712660003
► సంయుక్త సీపీ (సీసీఎస్)– 8712660004
► సంయుక్త సీపీ (ఎస్బీ)– 8712660005
► సంయుక్త సీపీ (పరిపాలన)– 8712660006
► సంయుక్త సీపీ (ట్రాఫిక్)– 8712660007
► మధ్య మండల డీసీపీ– 8712660101
► ఉత్తర మండల డీసీపీ– 8712660201
► దక్షిణ మండల డీసీపీ– 8712660301
► పశ్చిమ మండల డీసీపీ– 8712660401
► తూర్పు మండల డీసీపీ– 8712660501
► టాస్క్‌ఫోర్స్ డీసీపీ– 8712660701
► ప్రధాన కంట్రోల్ రూమ్: 871266000, 8712661000
in English
87126-60-001- City police commissioner
87126-60-002 Additional Commissioner of Police (L&O)
87126-60-003 Additional Commissioner (Crimes & SIT)
87126-60-004 Joint Commissioner of Police (CCS, DD)
87126-60-005 Joint Commissioner of Police (SB city)
87126-60-006 Joint Commissioner of Police (Admin)
87126-60-007 Joint Commissioner of Police (Traffic)
DCP and zonal officers
87126-60-201 onwards DCP North Zone and zonal officers
87126-60-301 onwards DCP South Zone and zonal officers
87126-60-401 onwards DCP West Zone and zonal officers
87126-60-501 onwards DCP East Zone and zonal officers
87126-60-601 onwards DCPs and all traffic officers
87126-60-701Onwards DCPs and Task Force officers
87126-60-801 Onwards CCS Officers
87126-61-101 Onwards SB Officers
87126- 60 -000, 87126- 61 -000 Police Control Room (PCR)
87126-60-100 Central Zone PCR
87126-60-200 North Zone PCR
87126-60-300 South Zone PCR
87126-60-400 West Zone PCR
87126-60-500 East ZonePCR
87126-60-600 Traffic PCR
87126-60-700 Task Force Control room
87126-60-800 CCS Control Room
87126-61-100 Special Branch PCR