Hyderabad Shocker: భార్యతో చిన్న గొడవ, కోపం ఆపుకోలేక కత్తితో ఆమె గొంతు కోసిన భర్త, చేసిన తప్పు తెలుసుకుని రూంలోకి వెళ్లి ఉరేసుకుని చనిపోయిన బాధితుడు
ఏరియాలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు (ends life at Jagadgirigutta) పాల్పడ్డాడు.
Hyd, Nov 11: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో దారుణం (Hyderabad Shocker) చోటు చేసుకుంది. ఏరియాలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు (ends life at Jagadgirigutta) పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బీ రాజు(35), బీ కవిత(33) దంపతులు రాజీవ్ గాంధీ నగర్‌లో నివాసముంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు జరిగేవి. గురువారం ఉదయం కూడా దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.
దీంతో సహనం కోల్పోయిన భర్త ఆవేశంతో కత్తితో ఆమె గొంతును (Man kills wife) కోసేశాడు. ఆమె ప్రాణాలు కోల్పోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. రాజు వేరే గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్న చిన్న విషయాలకే రాజు గొడవపడేవాడని కవిత కుటుంబ సభ్యులు తెలిపారు.