Representational Image (Google)

Hyderabad, Nov 11: హైదరాబాద్ (Hyderabad) కేపీహెచ్‌బీ (KPHB)లోని ఓ ఇంట్లో వ్యభిచారం (Prostitution) నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ (Anti Human Trafficking) బృందం దాడి చేసింది. కాలనీలోని (Colony) రోడ్ నంబరు 2, 3 మధ్యనున్న ఓ ఇంట్లో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారాన్ని అందుకున్న అధికారులు ఆ ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. ఆ సమయంలో ఓ విటుడు, యువతితోపాటు ఉన్న అక్కడ పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి 26 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి కొల్లాం, కొట్టాయంకు రైళ్లు.. ఈ నెల 20 నుంచి జనవరి 17వ తేదీ వరకు అందుబాటులో.. కాచిగూడ, నల్గొండ, కాజీపేట మార్గంలో ప్రయాణించనున్న రైళ్లు

వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారయ్యాడు. అదుపులోకి తీసుకున్న ముగ్గురినీ వారు కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. అనంతరం యువతిని పోలీసులు రెస్క్యూ హోంకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వ్యభిచార గృహ నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు.