Hyderabad Shocker: హైదరాబాద్‌లో విషాదకర ఘటనలు, పని టెన్సన్ తట్టుకోలేక మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య, భర్తతో గొడవపడి ఎయిర్‌పోర్ట్‌లోనే సూసైడ్ అటెంప్ట్ చేసిన ఇల్లాలు

మరో ఘటనలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

Representational Image (Photo Credits: File Image)

Hyd, June 10: హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. కొండాపూర్ పరిధిలో మానసిక ఒత్తిడికి గురైన ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆరంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిగా.. మరో ఘటనలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

పోలీసుల కథనం మేరకు మొదటి సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సౌందర్య (28) భర్త అభినవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కొండాపూర్‌లో నివాసముంటోంది.గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయంలో భర్త తండ్రి (మామ)కు ఫోన్‌ చేసి తాను హైదరాబాద్‌ను విడిచి దూరంగా వెళుతున్నానని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ ఫోన్‌ చేసి శంషాబాద్‌ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది.

భర్త వేరు కాపురానికి రావడం లేదని కక్ష, నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, పరారీలో భార్య

దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆర్‌జీఐఏ పోలీసులకు సమాచారం అందించి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించగా. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

మొబైల్ ఇస్తామంటూ రూంకి పిలిచి దారుణంగా అత్యాచారం, నొప్పి అంటూ అరుస్తున్నా నోరు మూసి పని కానిచ్చిన కామాంధులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

ఇక రెండో ఘటనలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే.. అది గమనించిన సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు.. ఆ యువతిని రక్షించారు. శుక్రవారం రాత్రి డిపార్చర్‌ విభాగం వద్ద పైనుంచి దూకేందుకు సదరు మహిళ ప్రయత్నించింది. వెంటనే అధికారులు ఆమెను కాపాడి.. మహిళా ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు అప్పగించారు. సదరు యువతిని బెంగళూరు(సౌత్‌)కి చెందిన శ్వేతగా గుర్తించారు.

భ‌ర్త‌ విష్ణు వర్ధన్ రెడ్డి, భార్య శ్వేత‌తో క‌లిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. హైదారాబాద్ లో కంపెనీ పెట్టాలని ఇక్క‌డికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల కార‌ణంగానే ఆమె ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది.