Hyderabad Shocker: ఉద్యోగ భద్రతపై ఆందోళన, హైదరాబాద్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పని ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Hyd, Mar 31: హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పని ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్సింగి అడ్మిన్ ఎస్సై బాలరాజు కథనం ప్రకారం.. గుంటూరు పట్టణానికి చెందిన వినోద్ కుమార్ (32) ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా గుంటూరు నుంచి పని చేసిన ఆయన.. ఆఫీస్‌కు వెళ్లాల్సి రావటంతో ఇటీవల అల్కాపూర్‌లోని సోదరుడి ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్నారు. ఉద్యోగ నిర్వహణకు కొత్త టూల్స్ రావడంతో ఆయన కొంచెం పని ఒత్తిడి చెందారు. ఇదే విషయాన్ని తరచూ సోదరుడితో చాలా సార్లు చర్చించారు. దీనికి తోడు పికప్ కాకుంటే ఉద్యోగ భద్రత ఉండదని ఆందోళన చెందాడు. ఈ నేపథ్యంలో గురువారం సోదరుడు, అతని భార్య బయటకు వెళ్లగా ఒంటరిగా ఉన్న వినోద్ కుమార్ బెడ్‌షీట్‌తో ఉరి వేసుకున్నాడు.
ఆ తర్వాత ఇంటికి వచ్చిన సోదరుడు వెంటనే వినోద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారు.