Hyderabad Shocker: ప్రేమ పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు, లాడ్జి నుంచి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి యువకుడు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన

ప్రేమలో విఫలమైన ఓ యువకుడు బేగంపేట లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. లైవ్ వీడియో కాల్‌ (Live video call)లో యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వివాహానికి ఇంట్లో కుటుంబసభ్యులు నిరాకరించడంతో 22 ఏళ్ల సాంబరాజు సూసైడ్ చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Representational Image (Photo Credits: File Image)

Hyd, May 23: ప్రేమలో విఫలమైన ఓ యువకుడు బేగంపేట లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. లైవ్ వీడియో కాల్‌ (Live video call)లో యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వివాహానికి ఇంట్లో కుటుంబసభ్యులు నిరాకరించడంతో 22 ఏళ్ల సాంబరాజు సూసైడ్ చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్‌ గోఖలేనగర్‌కు చెందిన టి.సాంబరాజు (22) సికింద్రాబాద్‌లోని ఓ జ్యువెలరీ షాపులో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగా ఉదయం 11 గంటలకు షాపునకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అయితే సాంబరాజు 12 గంటల ప్రాంతంలో బేగంపేటలోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. తాను ప్రేమించిన యువతితో వివాహానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో బేగంపేట్‌లో స్టే ఇన్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకుని... హోటల్ రూమ్ నుంచి ఇంట్లో వాళ్లకు వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు.

ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు, ఇద్దరు ది కేరళ స్టోరీ సినిమా చూసిన తర్వాత ట్విస్ట్, మతం మారాలని చిత్రహింసలు

దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఉప్పల్ నుంచి బేగంపేట వచ్చి చూసేసరికి సాంబరాజు సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. హాస్పిటల్‌కు తరలించగా చనిపోయినట్టు డాక్టర్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న బేగంపేట్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement