Hydra Commissioner Ranganath: 2025లోనూ కూల్చివేతలు ఆగవు..రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం అని వెల్లడి

హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందన్నారు కమిషనర్ రంగనాథ్. మీడియాతో మాట్లాడిన రంగనాథ్... ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం అన్నారు.

Hydra Commissioner Ranganath About 2025 demolitions(video grab)

Hyd, December 28: హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటిందన్నారు కమిషనర్ రంగనాథ్. మీడియాతో మాట్లాడిన రంగనాథ్... ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం అన్నారు. ఓఆర్ ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందని... జీహెచ్ ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారం ఇచ్చిందన్నారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పటివరకు రక్షించామని చెప్పారు.

12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా హైడ్రా రక్షించిందన్నారు రంగనాథ్. ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందని... 1095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తాం అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తాం అన్నారు. ఎఫ్ టీఎల్ ను పారదర్శకంగా చేయడం మా బాధ్యత అన్నారు.

శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం... 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నాం అన్నారు. ఎఫ్ టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుంది... శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్ టీఎల్ నిర్దారణ జరుగుతుందన్నారు. నాలాలపై కిర్లోస్కర్ కంపెనీ చేసిన స్టడీని తీసుకుంటున్నాం... 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయి అన్నారు.

అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి అని చెప్పారు రంగనాథ్. 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది... శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నాం అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై కుడా దృష్టి పెట్టాం అన్నారు.

2025 లో జియో ఫెన్సింగ్ సర్వే ఏర్పాటు చేస్తామన్నారు. 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం అన్నారు. త్వరలోనే 72 డీఆర్ ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయి... నాగోల్ లో ఉన్న డీఆర్ ఎఫ్ కేంద్రాన్ని బలోపేతం చేస్తాం అన్నారు. త్వరలోనే నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ రాబోతుందని... వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రా లో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.  మానవత్వమా నువ్వెక్కడా?, భర్తను సర్కార్ దవాఖానాలో చేర్పించిన వృద్ధురాలు.. ఆస్పత్రి బయట వృద్ధురాలిని వదిలేసిన ఆస్పత్రి సిబ్బంది...షాకింగ్ సంఘటన

హైడ్రా కు త్వరలో ఒక ఎఫ్ ఎం ఛానల్ కు ప్రయత్నిస్తున్నాం... హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుందన్నారు. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని... జులై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవు అన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం... ఎఫ్ టీఎల్ లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దు అన్నారు. ప్రజల ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నాం అని తేల్చిచెప్పారు రంగనాథ్‌.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement