Hydra Demolitions at Madhapur: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అమీన్ పూర్ కూల్చివేతల్లో హైడ్రా బిగ్ రికార్డ్.. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు (వీడియోలతో)

హైదరాబాద్ పరిసరాలలో అక్రమ కట్టడాలను కూలుస్తూ ఆక్రమణదారుల గుండెలలో దడ పుట్టిస్తోన్న హైడ్రా మరింత దూకుడు పెంచింది.

Hydra Demolitions at Madhapur (Credits: X)

Hyderabad, Sep 23: హైదరాబాద్ (Hyderabad) పరిసరాలలో అక్రమ కట్టడాలను (Hydra Demolitions) కూలుస్తూ ఆక్రమణదారుల గుండెలలో దడ పుట్టిస్తోన్న హైడ్రా మరింత దూకుడు పెంచింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్‌ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)

Here's Videos:

హైడ్రా రికార్డ్

ఆదివారం అమీన్ పూర్ లో అక్రమ నిర్మాణాలపై బిగ్ ఆపరేషన్ ను పూర్తి చేసిన హైడ్రా కొత్త రికార్డ్ సృష్టించింది. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు చేపట్టింది. రాత్రి ఒంటి గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. పటేల్ గూడలో 16 విల్లాలను కూల్చి వేశారు. ఒక హాస్పిటల్, 2 అపార్ట్ మెంట్లను కూడా అధికారులు కూల్చివేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత పగలు, రాత్రి ఆపరేషన్ ను నిర్వహించడం ఇదే తొలిసారి.

11 రోజుల పాటూ దీక్ష చేయ‌నున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్, తిరుమ‌ల ప్ర‌సాదం అప‌చారంపై ప్రాయ‌శ్చిత్త దీక్ష

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement