Student Suicide: హైదరాబాద్ బాచుపల్లిలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్ లో విడిచిపెట్టి పేరెంట్స్ ఇలా వెళ్లారో.. లేదో.. అంతలోనే ఘోరం..!

పట్టణంలోని జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

Student Suicide (Credits: X)

Hyderabad, Oct 21: హైదరాబాద్‌ (Hyderabad) లోని బాచుపల్లిలో (Bachupally) ఘోరం జరిగింది. పట్టణంలోని ఓ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు తొలుత స్పృహతప్పినట్లుగా సమాచారం ఇచ్చినట్టు.. తల్లిదండ్రులు కాలేజీకి వచ్చాక చనిపోయినట్లు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినిని అనూషగా గుర్తించారు. తల్లిదండ్రులు వచ్చే లోపే కళాశాల సిబ్బంది, బాచుపల్లి పోలీసులు అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల ఘాతుకం.. సొరంగ నిర్మాణ కార్మికుల క్యాంప్‌ పై కాల్పులు.. ముష్కరుల దాడిలో ఒక డాక్టర్, ఆరుగురు కార్మికుల మృత్యువాత

అసలేమైందంటే?

అనూష దసరా సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి ఆదివారం కాలేజీ హాస్టల్‌ కు తల్లిదండ్రులతో వచ్చింది. ఆదివారం ఆమెను హాస్టల్‌ లో వదిలేసి పేరెంట్స్ వెళ్లారు. కాసేపటికే ఆమె స్పృహతప్పి పడిపోయిందంటూ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అప్పటికే, వారు హైదరాబాద్ కూడా దాటలేదు. దీంతో వెంటనే వాళ్లు రిటర్న్ అయ్యారు.  తల్లిదండ్రులు కాలేజీకి తిరిగి రాగా... అనూష  ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.

గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో



సంబంధిత వార్తలు