Terror Attack in JK (Credits: X)

Newdelhi, Oct 21: జమ్ముకశ్మీర్‌ (Jammu Kashmir) లో ఉగ్రవాదులు (Terrorists) ఘాతుకానికి తెగబడ్డారు. గందర్‌ బాల్‌ జిల్లా గుండ్ ప్రాంతంలోని ఓ నిర్మాణ సైట్‌ క్యాంప్ లో ఉన్న కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక డాక్టర్‌తో పాటు ఆరుగురు కార్మికులు చనిపోయారు. మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందించారు. బాధిత కార్మికులు అందరూ స్థానికేతరులేనని, అందరూ ఒక ప్రైవేటు నిర్మాణ కంపెనీకి చెందినవారేనని పోలీసులు తెలిపారు. ఈ చర్యకు పాల్పడడానికి గల కారణాలను తెలుసుకునేందుకు అన్వేషిస్తున్నట్టు వెల్లడించారు.

గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో

Here's Video:

ఈ దాడి ఓ పాపపు చర్య

ఉగ్ర దాడిని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. అమాయక కార్మికులపై జరిపిన దాడి ఒక పాపమని, పిరికిపంద చర్య అని ఆయన అభివర్ణించారు. ఈ ఉగ్రదాడిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు.

యాప్ మోసం, రూ.లక్షాన్నర వరకు మోసం..యాప్ లాక్ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు...వీడియో ఇదిగో