IPL Auction 2025 Live

Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్‌లు, బయటకు వస్తున్న కీలక అంశాలు, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఫేర్‌ వల్ పార్టీ కోసం రూ. 2లక్షలతో పబ్ బుక్ చేసుకున్నట్లు వెల్లడి

ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్ మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మేజర్ ను చంచల్ గూడ జైలుకి తరలించగా, ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ (Juvenal Home)కు తరలించారు.

Representative image

Hyderabad, june 04: సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ (Jubilee Hills gang rape) కేసులో మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ (Arrest)చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్ మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మేజర్ ను చంచల్ గూడ జైలుకి తరలించగా, ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ (Juvenal Home)కు తరలించారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా దర్యాఫ్తు బృందం అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు అదుపులోకి తీసుకున్న వారిలో ఒక మేజర్ కాగా మరొకరు మైనర్. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.

Hyderabad Rape: అమ్నీషియా పబ్‌ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో పాటు ఇద్దరు అరెస్ట్‌, ఎంఐఎం నేతల పిల్లలను కాపాడుతున్నారు: ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణ 

ఇక అమ్నేషియా పబ్‌లో (Amnesia Pub) హైదరాబాద్‌కు చెందిన ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఫేర్‌వెల్ పార్టీ (Farewell Party)నిర్వహించుకున్నారు. దీని కోసం అసిఫ్ అనే విద్యార్థి కార్పొరేట్ విద్యా సంస్థ నుంచి లెటర్ హెడ్ కూడా తీసుకొచ్చి, పార్టీకి అనుమతి తీసుకున్నారు. మే 28న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 150 మంది విద్యార్థులు పబ్‌లో పార్టీ చేసుకున్నారు. నాన్ ఆల్కహాల్, నాన్ స్మోకింగ్ జోన్‌లో ఈ పార్టీ జరిగింది. నిషాన్, ఆదిత్య, ఇషాన్, అసిఫ్ ఈ పార్టీకి పబ్ బుక్ చేశారు. దీని కోసం దాదాపు రెండు లక్షల రూపాయలు చెల్లించారు. పార్టీకి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Atchutapuram Gas Leak: అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటన, ఎవ్వరికీ ప్రాణాపాయం లేదు, 124 మంది చికిత్స పొందుతున్నారని తెలిపిన మంత్రి బూడి ముత్యాలనాయుడు, గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై విచారణకు ఏపీ సీఎం ఆదేశం 

హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలి..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని తెలంగాణ బీజేపీ నేత..ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. ఈ రేప్ ఘటనకు సంబంధించి వీడియోలు..ఫోటోలు మా దగ్గర ఉన్నాయంటూ ఫోటోలను విడుదల చేశారు. రెడ్ కలర్ కారులో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని చెబుతున్నారు రఘునందన్ రావు. ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంటే కారులో ఎమ్మెల్యే కొడుకు లేడని పోలీసులు చెబుతున్నారని..ఇదంతా సదరు ఎమ్మెల్యే కొడుకుని (MLA son) కాపాడటానికి పోలీసులు నాటకాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. హైదరాబాద్ లో పోలీసులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కంట్రోల్ లో లేరని రజాకార్ల వారసులు చెప్పినట్లుగా పోలీసు కమిషనర్లు వింటున్నారంటూ ఎద్దేవా చేశారు. రేప్ ఘటనపై పోలీసులు లీకులు ఇచ్చారు తప్ప నిందితులను అరెస్ట్ చేయలేదని అన్నారు. ఇన్నోవా కారులో (Innova Car) ఉన్నవారిని మాత్రమే ముద్దాయిలుగా చూపు అసలైనవారిని తప్పించటానికి చూస్తున్నారంటూ మండిపడ్డారు బీజేపీ నేత రఘునందన్ రావు.

హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ ఘటనలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నారనే విషయం రాజకీయ పరంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆధారాలే లభించలేదని పోలీసులు చెపుతున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టారు. అమ్నేషియా పబ్ కు బెంజ్ కారులో ఉన్న ఎమ్మెల్యే కొడుకు, కారులో సదరు అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..ప్రశ్నించినవారిని పోలీసులు భయపెట్టేలా వ్యవహరిస్తున్నారనీ..పోలీసుల బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని అన్నారు. మమ్మల్ని భయపెట్టడం మానేసి, తప్పులు చేసిన వారిని భయపెట్టండి అంటూ ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే కేసులు పెడతామని పోలీసులు అన్నారని… ఘటనకు తగిన అన్ని ఈ ఆధారాలన్నీ చూపిస్తున్నానని..అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు ఎందుకు సీక్రెట్ గా దాస్తున్నారని ప్రశ్నించారు. నిందితులను ఇప్పటికే దేశం దాటించేసి ఉంటారని ఆరోపించారు. నిందితులు మేజరా, లేక మైనరా అనే విషయం అనవసరం కానీ చేసింది చాలా పెద్ద నేరం..నేరం చేసినవారు శిక్ష అనుభవించి తీరాలని అన్నారు. నిర్భయ కేసులో కూడా మైనర్ల పేర్లు బయటకు వచ్చాయని… ఇక్కడ మన పోలీసులు నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.