KA Paul in Munugode: మొన్న పాటలు.. నిన్న డ్యాన్సులు.. మరి ఇప్పుడు..? మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో కేఏ పాల్ ఊపు.. కొత్త కొత్త వేషధారణతో ఆకట్టుకునే యత్నం.. నెటిజన్లకు ఫుల్ పసంద్.. రైతు వేషంలో సైకిల్ తొక్కుతూ తాజాగా పాల్ ఎన్నికల ప్రచారం... వీడియో ఇదిగో!

మునుగోడులో ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రచారంలో ఊపు పెంచారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళుతున్నారు.

KA Paul (Credits: Twitter)

Munugode, October 29: మునుగోడులో (Munugode) ఉప ఎన్నికల (By-Elections) సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రజాశాంతి పార్టీ (Prajashanthi) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ప్రచారంలో ఊపు పెంచారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళుతున్నారు. నిన్న  ఆయన రైతు వేషం వేశారు. కండువాను తలకు కట్టుకున్న ఆయన, బనియన్, పంచెతో దర్శనమిచ్చారు. అంతేకాదు, సైకిల్ తొక్కుతూ పొలంబాట పట్టారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ మిషన్ బట్టల్ని కాదు, మనుషుల్ని ఉతుకుతుంది! జపాన్ సైంటిస్టులు కొత్త సృష్టి, మనుషులను శుభ్రం చేసే వాషింగ్ మిషన్ టెస్టింగ్, త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి....ఎలా పనిచేస్తుందో తెలుసా?

తన మాటలు, హావభావాలతో రైతులను నవ్వించారు. రైతులతో కలిసి పత్తి ఏరారు. ఇవాళ కేఏ పాల్ ప్రచారం చండూరు పరిధిలో సాగింది. అటు, బనియన్, పంచె, కళ్లకు కూలింగ్ గ్లాసెస్ తో వాహనం నుంచి కూడా ఆయన ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Ranjana Nachiyaar Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ఎన్‌ఈపీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ప్రముఖ నటి రంజనా నచియార్ రాజీనామా, విజయ్ టీవీకే పార్టీలోకి జంప్

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్‌ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీలో కుట్ర, 25 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు

Kavitha's ‘Pink Book’: పింక్ బుక్‌లో మీ పేర్లు రాస్తున్నాం, అధికారంలోకి వచ్చాక మీ సంగతి తేలుస్తాం, MLC కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement