![](https://test1.latestly.com/wp-content/uploads/2023/11/1-13.jpg?width=380&height=214)
Hyd, Feb 13: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Chief Minister Revanth Reddy) గద్దె దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారన్నారు.
వాళ్లంతా ను గద్దె దించేందుకు ఒక్కటయ్యారు. రేవంత్ పదవికి సొంత ఎమ్మెల్యేలతోనే ముప్పు పొంచి ఉంది’’ అని ఆయన (Errabelli Dayakar Rao) అన్నారు. అలాగే.. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో అసమ్మతి పెరుగుతోందని, 25 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని, ప్రభుత్వం కూలిపోయేందుకు ఇదే తొలి సంకేతమన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS) విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలతో ఓట్లేసి గెలిపించుకొని ఏ పనులు చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో విజయం మనదేనన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్నారు.కాంగ్రెస్ ఎన్నికల్లో పంచిన గ్యారంటీ కార్డులు ఎక్కడ పోయాయని దయాకర్‌రావు ప్రశ్నించారు. 420 హామీల అమలు 420 కింద పోయినట్టేనా? అని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలు వస్తున్నాయని గ్రామసభలు పెట్టి గ్రామాల్లో అలుజడలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని రోజులు చేసినా సర్వేలు.. ఉత్తవైన ఇదేనా ప్రజాపాలన అంటూ ఎద్దేవా చేశారు. కనీసం రైతులకు నీళ్లు ఇచ్చే దిక్కు లేదు ఈ ప్రభుత్వానికి లేదన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించామన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని.. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవేవీ చేతకావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని.. ఈ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయడం లేదని మండిపడ్డారు. సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదని.. వారికి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.