KA Paul as Shepherd: మునుగోడు ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తున్న కేఏ పాల్ రోజుకో అవతారం.. తాజాగా గొర్రెలు కాసిన ప్రజాశాంతి పార్టీ అధినేత... వీడియో వైరల్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే??

మునుగోడు ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తున్న కేఏ పాల్ రోజుకో అవతారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గొర్రెల కాపరి వేషంలో దర్శనమిచ్చారు. నియోజకవర్గం పరిధిలో కాసేపు గొర్రెలు కాశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడారు.

Paul (Credits: Twitter)

Munugode, October 31: మునుగోడు (Munugode) ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తున్న కేఏ పాల్ (KA Paul) రోజుకో అవతారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా గొర్రెల కాపరి (Shepherd) వేషంలో దర్శనమిచ్చారు. నియోజకవర్గం పరిధిలో కాసేపు గొర్రెలు (Sheeps) కాశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడారు. చేసిన 100 వాగ్దానాల్లో ఒక్కటీ నిలబెట్టుకోలేదని అధికార పక్షంపై (Ruling Party) విమర్శలు చేశారు.

మృత్యు వంతెన... గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలిన ప్రమాదంలో 130కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయ చర్యలు

ఇక్కడి గొర్రెల కాపరులను అడిగితే, ఎనిమిదేళ్లుగా వీళ్ల చేతుల్లో నరకం అనుభవిస్తున్నామని చెప్పారని వెల్లడించారు. "గొర్రెలను ఇస్తానని ఎక్కడైనా ఇచ్చాడా? ఇచ్చినవి ఎక్కడైనా బతికున్నాయా? అయినా, చదువుకున్నవాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరా? ఇలా గొర్రెలు కాసుకోవాలా? ఎంత కష్టం! మీ కొడుకులు, మీ కూతుర్లు ఏమో వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుని ప్రపంచమంతా తిరుగుతారు. ఎందుకంటే మీరు దొరలు... మేం బీసీలం. ఈ నాటకం ఇక ఎంతమాత్రం చెల్లదు. వాగ్దానాలు ఎందుకు నిలబెట్టుకోలేదో ముందు సమాధానం చెప్పండి. ఇక్కడికొచ్చి ఎలా ఓట్లు అడగ్గలుగుతున్నారు? ఇది సిగ్గుపడాల్సిన విషయం" అంటూ కేఏ పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Ranjana Nachiyaar Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ఎన్‌ఈపీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ప్రముఖ నటి రంజనా నచియార్ రాజీనామా, విజయ్ టీవీకే పార్టీలోకి జంప్

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్‌ రెడ్డిని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీలో కుట్ర, 25 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు

Kavitha's ‘Pink Book’: పింక్ బుక్‌లో మీ పేర్లు రాస్తున్నాం, అధికారంలోకి వచ్చాక మీ సంగతి తేలుస్తాం, MLC కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement