Telangana: ఘోర విషాదాలు, ముగ్గురు యువతుల ఆత్మహత్య, ధర్మపురం చెరువులో ఇద్దరి మృతదేహాలు లభ్యం, మరో మృతదేహం కోసం గాలింపు, కర్నూలులో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

ధర్మపురం చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు ( two young women dead bodies) లభించాయి. ఉప్పరిపేటకు చెందిన ముగ్గురు యువతులు బుధవారం నుంచి కనిపించడం లేదు. వారికోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.

Representational Image (Photo Credits: Twitter)

jagtial, Oct 28: తెలంగాణలో జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్‌లో గురువారం విషాదం​ చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న గుట్టవద్ద గల ధర్మసముద్రం చెరువులో దూకి ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఇద్దరికి వివాహం అవ్వగా, మరో యువతి ఇంటర్ చదువుతోంది. కాగా ధర్మపురం చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు ( two young women dead bodies) లభించాయి. ఉప్పరిపేటకు చెందిన ముగ్గురు యువతులు బుధవారం నుంచి కనిపించడం లేదు. వారికోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.

ఒకే వీధిలో నివసించే ముగ్గురు యువతుల్లో వందన, మల్లిక అనే అమ్మాయిల మృతదేహాలు చెరువలో దొరికాయి. మరో యువతి గంగాజల మృతదేహం కోసం గాలింపు చర్యలు (another girl dead body missing ) కొనసాగుతున్నాయి. ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరో విషాదకర ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

మిస్ తెలంగాణ 2018 యువతి ఆత్మహత్యాయత్నం, చనిపోతున్నానంటూ ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో, యువతిని రక్షించిన పోలీసులు

ఏపీలో నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో విషాదం అలుముకుంది. అల్లూరు పెద్ద కుంటలో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. ముగ్గురు మృతులు విశాల్,శరత్,మహేష్‌గా గుర్తించారు. విద్యార్థుల మృతదేహాలను గ్రామస్తులు కుంటలో నుంచి బయటకు తీశారు. విద్యార్థుల మృతదేహాలకు ఎమ్మెల్యే ఆర్థర్‌ నివాళులు అర్పించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement