Secunderabad Shocker: సికింద్రాబాద్‌లో దారుణం.. కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!

నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై అదునుచూసి దాడిచేసిన ఓ దుండగుడు బాధితుడి కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచాడు. అనంతరం 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లో గత రాత్రి జరిగింది.

Representational (Twitter/ANI)

Hyderabad, Dec 6: నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై అదునుచూసి దాడిచేసిన ఓ దుండగుడు బాధితుడి కళ్లలో కారం (Chilli Powder) కొట్టి, కత్తితో (nife) పొడిచాడు. అనంతరం 14 తులాల బంగారు ఆభరణాలు (Gold Jewellery) లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లో (Secunderabad) గత రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హిమాయత్ నగర్‌లోని రాధే జువెల్లర్స్‌కు చెందిన పవన్ బంగారు నగలతో సికింద్రాబాద్ బయలుదేరాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మన భాగ్యనగరికి వచ్చిందోచ్... వీడియో ఇదిగో!

సికింద్రాబాద్ చేరుకున్నాక సిటీలైట్ హోటల్ సమీపంలో దుండగుడు అతడిపై దాడిచేసి కళ్లలో కారం చల్లి, కత్తితో పొడిచాడు. అనంతరం అతడి వద్దనున్న 14 తులాల బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement